25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

వరద బాధితులకు అండగా ఉంటా

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ సలహాదారుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ
  • భిక్కనూరు లో వరద బాధితులకు పరామర్శ

బతుకమ్మ భిక్కనూరు: అకాల వర్షాల కారణంగా నిరాశ్యులైన వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ప్రభుత్వ సలహాదారుడు మాజీమంత్రి షబ్బీర్ అలీ భరోసా కల్పించారు. భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి వరద బాధితులు పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులను షబ్బీర్ అలీ పరామర్శించారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తూ చిల్లర వేషాలు వేస్తున్నాయని అన్నారు. కేటీఆర్ అమెరికా పర్యటన ఉండి ట్విట్టర్ వేదిక గా ఇష్టం వచ్చినట్లు ఆరోపణ చేస్తున్నాడని అన్నారు. తమ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లాలోని పర్యటిస్తూ బాధితులకు అన్ని విధాలుగా ఆదుకుంటూ భరోసా కల్పించడం జరుగుతుందని అన్నారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద రెండు వేల రూపాయలను పండ్లను పంపిణీ చేసి రేపటిలోగా బాధితులందరికీ బట్టలను అందజేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇంద్రకరణ్, ఎడ్ల రాజిరెడ్డి,చంద్రకాంత్, మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article