29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

లెండి వాగును పరిశీలించిన అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మద్నూర్: గోజేగావ్ గ్రామం వద్ద గల లెండి వాగు ప్రవాహాన్ని అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. మంగళవారం వాగు పరిస్థితులు, వంతెన స్థితిగతులు అధికారులను అడిగి తెలుసుకున్నారు.  గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా లెండి వాగును మండల తహసీల్దార్, ఎంపిడిఓ తో కలిసి పరిశీలించారు.    వాగు ప్రవాహం ఎక్కువగా ఉంటే గ్రామస్తులు వాగులు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట మద్నూర్ మండల తహసీల్దార్ ఏం డి ముజీబ్, ఎంపిడిఓ రాణి, ఎంపీఓ నర్సయ్య, , గిర్దవర్ శంకర్, గ్రామ పంచాయితీ కార్యదర్శి లక్ష్మణ్,  పాల్గొన్నారు.

More articles

Latest article