నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం నిజామాబాద్ డీసీ కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా నూతన డిప్యూటీ కమిషనర్ కు కామారెడ్డి ఈఎస్ ముకుందర్ రెడ్డి, కార్యాలయం సూపరిండెంట్ అరుణ్ కుమార్ లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిజామాబాద్ డివిజన్ మినిస్ట్రీరియల్ సిబ్బంది, తెలంగాణ ఎక్సైజ్ ఫోరం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ఎక్సైజ్ సెంట్రల్ ఫోరం వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్, జిల్లా అధ్యక్షులు ఆనంద్, ఎఏవో నర్సయ్య, సీనియర్ కోఆపరేటివ్ ఇన్స్ పెక్టర్ సలీం, సీనియర్ అసిస్టెంట్లు శ్రీధర్, దేవేంధర్, ఆఫీసర్ ఇమాన్యుయెల్, రిజ్వాన్, రాజు, రానా, నాగరాజు, సభా, ప్రియాంక, సాయిబాబా, నిశితలు ఉన్నారు.
