బాన్సువాడ , బతుకమ్మ : బాన్సువాడలో ఏర్పాటు చేసే శ్రీచైతన్య విద్యా సంస్థను బహిష్కరించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బాలరాజ్, తెలంగాణ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. పట్టణంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీచైతన్య విద్యా సంస్థల్లో చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. రూ.లక్షల్లో ఫీజులు, విద్యార్థులపై సిబ్బంది వేధింపులు చూస్తున్నామన్నారు. సమావేశంలో శివ, కార్తీక్, సాయికుమార్, విఠల్, రాజు, కిరణ్, అశోక్ పాల్గొన్నారు.
