27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వ్యసనాలకు గురి కాకుండా ఉండేందుకు క్రీడలు తోడ్పడుతాయి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

. . . గిరిరాజ్ కళాశాల లో ఘనంగా క్రీడా మహోత్సవం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

యువకులు వ్యసనాలకు గురి కాకుండా క్రీడలు తోడ్పడుతాయని, క్రీడలలో పాల్గొంటే మానసిక ఉల్లాసంతో పాటు, ఆరోగ్యవంతంగా ఉండేందుకు దోహదపడుతాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో శనివారం క్రీడా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా క్రీడా మహోత్సవాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి. రామ్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాల ప్రగతిని, అధ్యాపకులు, విద్యార్థులు సాధించిన విజయాలను వెల్లడించారు. అనంతరం సీపీ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

 

Sports help prevent addictions

 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ భవిష్యత్తులో మనం ఏ స్థాయిలో ఉండాలో, ఎటువంటి సమాజం కోరుకుంటు న్నామో తగిన ప్రణాళికలతో కళాశాల చదువు కొనసాగించాలన్నారు. చదువు ఎక్కడనుండైనా కొనసాగించవచ్చని, కానీ కళాశాలకు వచ్చి చదవడం ద్వారా మన సమాజానికి తగిన విధంగా మన వ్యక్తిత్వం రూపొందుతుందన్నారు. కళాశాలలో నిరంతరం క్రీడలను నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బాలమణి ని ప్రత్యేకంగా అభినందించారు. వివిధ క్రీడల్లో విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ విద్యా సంవత్సరం ఫిజికల్ సైన్స్ విభాగం ఓరల్ చాంపియన్ షిప్ గెలుచుకోవడం జరిగింది. రెండవ స్థానంలో కామర్స్ విభాగం నిలిచింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, పి.ఆర్. వో దండు స్వామి, ఎన్ సిసి ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ రాజేష్, అకాడమిక్ కోఆర్డినేటర్ నహీదా బేగం, కామర్స్ విభాగం అధిపతి వినయ్ కుమార్, ఏ.ఓ. రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయభాస్కర్, అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్.సి.సి. క్యాడెట్లు పాల్గొన్నారు.

Sports help prevent addictions

 

More articles

Latest article