30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయి

Must read

📰 Generate e-Paper Clip

  • విజేతలకు బహుమతులను అందజేసిన కాసుల బాలరాజ్

బాన్సువాడ, బతుకమ్మ  : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని క్రీడల వల్ల మానసిక ప్రశాంతతో పాటు శారీరక దారుడ్యం ఏర్పడుతుందని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. గురువారం వర్ని  మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలికిదీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేక్, కామారెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, నాయకులు నేమాని వీరాజు, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మన్సూర్,   బారి ,నారెడ్ల  సాయిలు ,కిషన్ ,శంషోద్దీన్ ,మారుతీ,ఎంఆర్వో , ఎంఈవో , సాయి బాబా ,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article