మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయి

విజేతలకు బహుమతులను అందజేసిన కాసుల బాలరాజ్ బాన్సువాడ, బతుకమ్మ  : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని క్రీడల వల్ల మానసిక ప్రశాంతతో పాటు శారీరక దారుడ్యం ఏర్పడుతుందని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. గురువారం వర్ని  మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలికిదీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను ఏర్పాటు...