- గ్రామాల్లో బోర్డులు ఏర్పాటు చేసి వదిలేసిన వైనం
- నిర్వహణ లేక ప్రజాధనం వృధా
- కనిపించని ఆట వస్తువులు
రుద్రూర్, బతుకమ్మ : గ్రామాల్లోని యువత, విద్యార్థులకు ఆటలతో ఆరోగ్యమైన జీవితం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. అంతవరకు బాగానే ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో వాటి నిర్వహణ ఆయా గ్రామాల్లో అధ్వానంగా మారింది. క్రీడా ప్రాంగణాల బోర్డులను ఏర్పాటు చేసి వదిలేయడంతో పలుచోట్ల క్రీడా ప్రాంగణాలు నిరూపయోగంగా కనిపిస్తున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు రాయకూర్, సిద్దాపూర్, రాణంపల్లి తదితర గ్రామాలల్లో ఊరికి దూరంలో క్రీడా ప్రాంగణాలు ఉండటంతో ఆడుకునేందుకు యువకులు, విద్యార్థులు ముందుకు రావడం లేదు. వీటి అలనా, పాలనా పూర్తిగా కరువవ్వడంతో పిచ్చి మొక్కలు పెరిగి ఆటలకు పనికి రాకుండా ప్రాంగణాలు దర్శనమిస్తున్నాయి. పలు గ్రామ పంచాయతీల్లో ఊరికి దూరంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో ఒక్క రోజు కూడా క్రీడాకారులు వచ్చి ఆటలు అడిన దాఖాలాలు లేవు.
- గ్రామాల్లో క్రీడా మైదానం బోర్డులు ఏర్పాటు చేసి వదిలేసిన వైనం..
గత తెలంగాణ ప్రభుత్వం గ్రామాలల్లో క్రీడాకారుల కోసం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. ఈ క్రీడా ప్రాంగణాలు అలంకార ప్రాయంగా ఏర్పాటు చేసి వదిలేశారు. చాలాచోట్ల క్రీడా ప్రాంగణాలను వినియోగించుకోకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి.
- నిర్వహణ లేక ప్రజాధనం వృధా..
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం కోసం ప్రతి గ్రామంలో ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. క్రీడా ప్రాంగణానికి అవసరమైన స్థలాన్నీ గుర్తించి అన్ని వసతులు, సదుపాయాలు ఏర్పాటు చేయుటకు గాను సుమారు 25 వేల నుండి లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేసింది. గ్రామీణ ప్రాంతాలలో ఎంతో మంది నైపుణ్యం కలిగిన యువ క్రీడాకారులున్నారని. వారి ప్రతిభను గుర్తించి మంచి క్రీడాకారునిగా ఎదిగి గ్రామానికి జిల్లాకు రాష్ట్రానికి మంచి గుర్తింపు తేవడానికి వీలుగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. కానీ గ్రామాలల్లో క్రీడా ప్రాంగణాలు నిర్వహణ లేక ప్రజాధనం వృధా అవుతుందని చెప్పవచ్చు. ఈ క్రీడా ప్రాంగణాలు కేవలం అలంకారప్రాయంగా మిగిలిపో యాయని, ఈ ప్రాంగణంలో ఆటలు ఆడిన జాడ కానరావడం లేదు. ఈ క్రీడా ప్రాంగణంలో వర్షం వల్ల పిచ్చి మొక్కలు గడ్డి పెరిగిపోయి. ఆటలు ఆడడానికి ఏ మాత్రం అనుకూలంగా లేకుండా పోయాయి. ప్రభుత్వ సదాశయం ఒకటైతే గ్రామీణ ప్రాంతంలోని క్రీడా ప్రాంగణాలు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటున్నాయి. గ్రామీణ క్రీడా కారులను ప్రోత్సహించి వారి ప్రతిభను గుర్తించి దేశానికి ఒక మంచి క్రీడా కారులను అందించాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఈ క్రీడా ప్రాణాలను ఏర్పాటు చేసింది. క్రీడాకారులు ఆదుకునేందుకు గాను క్రీడా పరికరాలు కూడా సమకూర్చారు. కానీ క్రీడా ప్రాంగణాలు వెల వెల బోతున్నాయి. క్రీడా ప్రాంగణాలల్లో ఇప్పటికి ఆటలు ఆడిన దాఖలాలు లేవు. ఈ క్రీడా ప్రాంగణాలు ఊరికి దూరంగా ఉండడం కూడా క్రీడాకారులు ఆడుకునేందుకు ఉత్సాహం చూయించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఈ విషయంలో స్పందించి క్రీడా ప్రాంగణాలల్లో క్రీడలు ఆడించే విధంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలు ఉన్న ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన ఇటీవల నిర్వహించిన సీఎం కప్ క్రీడలను క్రీడా ప్రాంగణంలో కాకుండా రుద్రూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్ లోనే నిర్వహించడం విశేషం. వేలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు వృథాగా ఉంటున్నాయి. గ్రామాల్లో వివిధ రకాల క్రీడలు ఆడుకుంటు నైపుణ్యం సాధిస్తేనే కదా మండల స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు. కానీ ఇక్కడ ఏ గ్రామంలో కూడడా క్రీడా ప్రాంగణంలో ఆడుకుంటున్న ఆనవాలు లేవు. అధికారులు ఈ విషయంలో దృష్టి సారించి క్రీడా ప్రాంగణాలల్లో ఆటలు ఆడుకునే విదంగా సిద్ధం చేసి క్రీడా కారులను ప్రోత్సహించాలని ప్రజలు కోరుతున్నారు.
