అలంకార ప్రాయంగా క్రీడా ప్రాంగణాలు
గ్రామాల్లో బోర్డులు ఏర్పాటు చేసి వదిలేసిన వైనం నిర్వహణ లేక ప్రజాధనం వృధా కనిపించని ఆట వస్తువులు రుద్రూర్, బతుకమ్మ : గ్రామాల్లోని యువత, విద్యార్థులకు ఆటలతో ఆరోగ్యమైన జీవితం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. అంతవరకు బాగానే ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో వాటి నిర్వహణ ఆయా గ్రామాల్లో అధ్వానంగా మారింది. క్రీడా ప్రాంగణాల బోర్డులను ఏర్పాటు చేసి వదిలేయడంతో పలుచోట్ల క్రీడా ప్రాంగణాలు నిరూపయోగంగా కనిపిస్తున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు రాయకూర్, సిద్దాపూర్,...