29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పోచారం దంపతుల ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : గురుపౌర్ణమి సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నసురుల్లాబాద్ మండలం నెమ్లి సాయిబాబా ఆలయం,కల్కి చెరువు వద్ద సాయిబాబా ఆలయం, బాన్సువాడ పట్టణంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి – పుష్ప దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం గురువులు, శారద ఉపాసకులు శ్రీ శ్రీ శ్రీ మంగళ గిరి నరసింహ మూర్తి  (చేర్యాల స్వామీజీ) ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ  ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Special pujas for the Pocharam couple

More articles

Latest article