- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తిని గురువులుగా భావిస్తాం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన మల్లారంలో ఉన్న శ్రీ లింగేశ్వర ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమాధిపతి పిట్ల కృష్ణమహారాజ్ గురూజీని దర్శించుకొని ఆశీర్వాదాలను పొందారు. అనంతరం దత్త గుడి, నిరుకొండ హనుమాన్, పలు దేవాలయాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ప్రతి వ్యక్తికి మొదటి గురువులు వారి తల్లి తండ్రులే అని అన్నారు. సనాతన హిందూ ధర్మంలో గురువులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః। గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటుగురువులను త్రిమూర్తులతో సమానంగా కొలవడం జరుగుతుందన్నారు. గురుపౌర్ణమి పర్వదినం గురువులకు కృతజ్ఞతలు చెప్పే రోజు మాత్రమే కాకుండా, విజ్ఞానాన్ని, సంస్కారాన్ని, ఆధ్యాత్మికతను విశ్వసించేవారి కోసం గొప్ప అనుభూతిని కలిగించే దినం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్ శివునూరు, శ్రీధర్, సతీష్, బాబీ సింగ్,నాయకులు భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

