27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సర్పంచులు, అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎంపీడీఓ బి. శ్రీనివాస్

 

జుక్కల్, బతుకమ్మ :

 

గ్రామపంచాయతీల సామర్థ్యాన్ని పెంపొందించడం, గ్రామాల సమగ్ర అభివృద్ధిపై చర్చించేందుకు జులై 28న జుక్కల్ ఎంపీపీ సమావేశ మందిరంలో ప్రత్యేక మండలస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ బి. శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. జడ్పీ సీఈఓ, జుక్కల్ మండల ప్రత్యేక అధికారి చందర్ నాయక్ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో గ్రామపంచాయతీల అభివృద్ధి, పరిపాలనా సామర్థ్యాల పెంపు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమగ్రంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు, గ్రామపంచాయతీల కార్యదర్శులు, అన్ని గ్రామాల సర్పంచులు ఈ ప్రత్యేక సమావేశానికి తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని ఎంపీడీఓ బి. శ్రీనివాస్ కోరారు. సంబంధిత అధికారులు సమయానికి హాజరై సమావేశంలో చురుకుగా పాల్గొని గ్రామాభివృద్ధికి అవసరమైన సూచనలు, కార్యాచరణపై చర్చించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article