మార్కెట్ యార్డును ముట్టడించిన సోయా రైతులు
మద్నూర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో సోయా రైతులు సోమవారం మార్కెట్ యార్డును ముట్టడించారు. రైతుల వద్ద ఉన్న వేల క్వింటాళ్ల సోయాను కొనుగోలు చేయకుండా కొనుగోలు కేంద్రం ఎలా ముసివేస్తారని సొసైటీ కార్యదర్శిని ప్రశ్నించారు. దాదాపు పక్షం రోజులుగా మద్నూర్ మార్కెట్ యార్డ్ కు సోయాలు తీసుకువచ్చిన రైతులు కొనుగోలు కేంద్ర (మద్నూర్ పిఎసీఎస్) తెరిచే అవకాశం లేకపోవడంతో సోమవారం మార్కెట్ యార్డును ముట్టడించారు. ఉమ్మడి మద్నూర్ మండలంలోని రైతుల మద్నూర్ మార్కెట్ యార్డుకు 50 మంది రైతులు 8 వేల క్వింటాళ్ల సోయాలను...