- జీ.పి సెక్రటరీ స్వప్న
భీమ్ గల్, బతుకమ్మ : పిల్లలు సమాజంలో ఎలా మాసలుకోవాలో నేర్పించడం వారిని సమాజానికి అనువుగా తీర్చిదిద్దడం తల్లుల భాద్యత అని జీ. పి సెక్రటరీ స్వప్న అన్నారు.మంగళవారం సాధన సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహలు, బాల కార్మికుల పై అవగాహన సదస్సును మండలంలోని బెజ్జోర గ్రామంలో నిర్వహించారు.ఈ కార్యమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక పంచాయతీ సెక్రటరీ స్వప్న మాట్లాడారు. బాల్య వివాహలను చేయడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. బాల్య వివాహలపై, బాల కార్మికులపై, బాలలపైన జరుగుతున్న హింసలపైన, బాలల అక్రమ రవాణాపై బాలల హక్కుల పైన సాధన సంస్థ కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్ అని తెలియజేశారు. బాల్య వివాహాలు జరిగినట్టు తెలిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెం. 1098 డయల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలియజేసారు. సైబర్ క్రైమ్స్ వల్ల జాగ్రత్తగా ఉండాలని లాటరీ పొందరని ఓటీపీ లు చెప్పుమాంటే చెప్పవద్దని, లింక్స్ ఓపెన్ చేయవద్దని దాని ద్వారా మోసపోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ డబ్బు పోగొట్టుకుంటే సైబర్ క్రైమ్స్ నెంబర్ 1930 కి సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ,సాధన సంస్థ సి.యస్.ఎం నిరీక్షణ అంగన్వాడీ టీచర్స్, మహిళలు పాల్గొన్నారు.
