32.8 C
Hyderabad

ఘనంగా సోమలింగ శివాచార్య మహారాజ్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ :

 

బిచ్కుంద పీఠాధిపతి, పరమ పూజ్యులు సోమలింగ శివాచార్య మహారాజ్ జన్మదిన సందర్భంగా వారి జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. బిచ్కుంద మండల కేంద్రం లోని బండాయప్ప మఠానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు విచ్చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, మహారాజ్ ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఆధ్యాత్మిక విలువలు, సేవా భావం పెంపొందించడంలో చేస్తున్న కృషిని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో, ఆనందంతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని ఆకాంక్షించారు.

More articles

Latest article