27.6 C
Hyderabad

డిసెంబర్ నెలాఖరు నాటికి ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలి

The construction of the Dharpally Area Hospital must be completed by the end of December

Must read

📰 Generate e-Paper Clip

. . . ఎరియా ఆసుపత్రిని తనిఖీ  చేసిన జిల్లా కలెక్టర్  ఇలా  త్రిపాఠి

ధర్పల్లి , బతుకమ్మ :

ధర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నెలకొల్పుతు న్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తుది దశ నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా చేపట్టి డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధర్పల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ౩౦ పడకల స్థాయి నుండి 100 పడకలకు పెంచుతూ ఏరియా ఆసుపత్రిగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసిన నేపథ్యంలో రూ. 33.15 కోట్ల నిధులను వెచ్చిస్తూ అధునాతన వసతులతో నూతన భవన నిర్మాణం జరుపుతున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే 90శాతం వరకు పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించి, ఇంకనూ చేపట్టాల్సి ఉన్న తుది దశ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. మిగతా పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మాతాశిశు, పీడియాట్రిక్ విభాగాలు, క్యాజువాలిటీ, రేడియాలజీ, ఆపరేషన్ థియేటర్లు, ఆయుష్ బ్లాక్, మేల్, ఫిమేల్ వార్డు, ఆప్తాలమిక్, డెంటల్, ఓ.టీ, డయాగ్నొస్టిక్ తదితర విభాగాలను కలెక్టర్ సందర్శించి పనుల నాణ్యతను నిశితంగా పరిశీలన జరిపారు.

The construction of the Dharpally Area Hospital must be completed by the end of December

నాణ్యత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడవద్దని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులు చేపట్టే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే తమ దృష్టికి తేవాలని సూచించారు. తుది దశ పనులను క్రమం తప్పకుండా సందర్శిస్తూ పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల నిర్మాణాలు, నిర్దేశించిన విధంగా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్న తరువాతే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన అన్ని వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ గవర్నింగ్ కౌన్సిల్ చైర్ పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, స్థానిక తహసిల్దార్ శాంత, టీజీఎంఐడీసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తదితరులు ఉన్నారు.

More articles

Latest article