25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

సమాజహితమే ఆర్ ఎస్ ఎస్ ధ్యేయం

Must read

📰 Generate e-Paper Clip

Social welfare is the mission of RSS

నిజామాబాద్, బతుకమ్మ:  దేశం, ధర్మం రక్షణ.. సమాజాన్ని జాగ్రుతం చేయడమే ఆర్ఎస్ఎస్ ధ్యేయమని హిందూ జాగరణ మంచ్(హిందూవాహిని) జాతీయ సంఘటన మంత్రి పెనుబల్లి దేవేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని హరిచరణ్ మార్వాడీ పాఠశాలలో గురువారం ఆర్ ఎస్ ఎస్ విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా  నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్ ఎస్  ఎస్  కు సాటి వచ్చే సంస్థ ప్రపంచంలోనే లేదన్నారు. సమాజహితం కోసం తిరస్కారాలు, అణచివేతలను ఎదుర్కొని గత 99ఏళ్లుగా ఆర్ ఎస్  ఎస్ నిలబడిందన్నారు. గో హత్యలకు వ్యతిరేకంగా  దేశ వ్యాప్తంగా సంతకాల సేకరణ, వివేకానంద శిలాస్మారకం, రామ సేతు పరిరక్షణ ఉద్యమం, రామజన్మభూమి ఉద్యమంలో ప్రజామద్దతుతో ఆర్ ఎస్ ఎస్ విజయం సాధించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, వేయి మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.

Social welfare is the mission of RSS

More articles

Latest article