. . . లింగ నిర్ధారణ పరిక్షలు నిర్వహించే వ్యక్తి టాస్క్ పోర్స్ అధుపులో
. . . గత కొన్ని రోజులుగా సాగుతున్న వ్యవహరం
కామారెడ్డి, బతుకమ్మ:
కామారెడ్డి జల్లా రాజంపేట్ మండలం లో బుదవారం రాత్రి టాస్క్ పోర్స్ పోలిస్ లు ఓక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.గత కోన్ని రోజులు గా సంబంధిత వ్యక్తి లింగనిర్ధారణ పరిక్షలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పకడ్బంది సమాచారంతో దాడి చేసినట్లు తెలిసింది. రాజం పేట్ మండల కేంద్రానికి చెందిన బల్ల రవి గతంలో కామారెడ్డిలో ఓక ఆసుపత్రిలో పని చేశాడు. అక్కడ పని చేసిన అనుభవంతో రాజంపేట్ లో లింగనిర్ధారణ పరిక్షలు నిర్వహిస్తున్నాడు. ఈ విషయంపై స్థానికులు పిర్యాదు చేయడంతో పక్క సమాచారంతో టాస్క పోర్స్ పోలిస్ లు దాడి చేసి రవిని పట్టుకుని కామారెడ్డికి తరలించినట్లు తెలిసింది. స్థానిక పోలిసులు మాత్రం తమకు విషయం తెలియదని, కామారెడ్డి టాస్క్ పోర్స్ పోలిస్ లు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది..ఇటివల కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్యుడికి సంబంధించిన ప్రైవేట్ హస్పీటల్ లో లింగ నిర్ధారణ పరిక్షల గుట్టును మహ పోలిస్ లు రట్టు చేసిన విషయం తెలిసిందే. సంబంధిత డాక్టర్ గాంధారీ మెడికల్ ఆఫిసర్ గా పని చేస్తుండగా అతడిని అధికారులు సస్పెండ్ చేసి ఆసుపత్రి లైసెన్స్ ను రద్ధు చేశారు.