27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సిరికొండ ఎఫ్ఆర్ఓ ఎం.వినాయక్ నాయక్ సస్పెన్షన్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా సిరికొండ అటవీ రేంజ్ అధికారి మాలోత్ వినాయక్ నాయక్ ను సస్పెన్షన్ చేస్తూ రాష్ట్ర పీసీసీఎఫ్ రాకేష్ మోహన్ దోబ్రియాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సిరికొండ రేంజ్ కు ఎం.వినాయక్ కు రెండవ ఎఫ్ ఆర్ ఓ కావడం గమనార్హం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం యాచారం తాండకు చెందిన ఎం.వినాయక్ డైరెక్ట్ ఎఫ్ఆర్ వోగా రిక్రూట్ అయ్యారు. గతంలో నిజామాబాద్ రేంజ్ లో స్పెషల్ డ్యూటీలో పని చేశారు. రెండేళ్ళ క్రితం సిరికొండ మండలం అటవి రేంజ్ అధికారిగా నియమితులయ్యారు. సిరికొండ మండలం లోని రావుట్ల తూంపల్లి బీట్ల పరిధిలో అటవీ భూముల ఆక్రమణ, అటవీ సంపద తగ్గిపోవడంపై ఆరోపణలున్నాయి. డబ్బులు తీసుకుని పోడు భూములకు ఆయన సహకరించారన్నది ప్రధాన ఆరోపణలున్నాయి. ఆరోపణల నేపథ్యంలో అటవి శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్మూర్ ఎఫ్ డీవో ద్వారా విచారణ జరిపారు. గత నెలలో సిరికొండ శిక్షణ ఆఫీసర్ అధికారి ఈ సెక్షన్ ఆఫీసర్ వసంతరావుబేస్ క్యాంపు తాత్కాలిక ఉద్యోగి నరేందర్ లను సస్పెన్షన్ చేశారు. ఎఫ్ఆర్ వో స్థాయి అధికారిపై ఆరోపణలు రావడంతో ఆయన పదవి కాలంలో జరిగిన అటవి భూముల అక్రమణ దానిపై విచారణ చేపట్టారు. ముందుగా సర్వే చేపట్టి ఎన్ని ఎకరాల్లో భూములు కబ్జాలకు గురయ్యాయి, అందులో పాత్రపై ఆరా తీసిన తర్వాతనే వెంటనే ఈ మేరకు వేటు వేసినట్లు తెలిసింది. అయితే ఎఫ్ఆర్ వో పై వేటును అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. సిరికొండ రేంజ్ లో పని చేస్తున్న మరో అధికారి పై కూడా పలు ఆరోపణలున్నాయి. స్థానికుడు అయిన అధికారి పథకం ప్రకారమే ఎఫ్ఆర్ వో లీలలను ఉన్నత స్థాయి అధికారులకు చేర వేశాడన్న వాదనలున్నాయి. ఎఫ్ఆర్ వో లేకపోతే తన పెత్తనం ఉంటుందనే స్వయంగా అధికారులకు ఫిర్యాదులతో పాటు ఉప్పందించడంలో కీలక పాత్ర పోశించాడని ఫారెస్టు శాఖలో చర్చ జరుగుతుంది.

More articles

Latest article