సిరికొండ ఎఫ్ఆర్ఓ ఎం.వినాయక్ నాయక్ సస్పెన్షన్

బతుకమ్మ, నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా సిరికొండ అటవీ రేంజ్ అధికారి మాలోత్ వినాయక్ నాయక్ ను సస్పెన్షన్ చేస్తూ రాష్ట్ర పీసీసీఎఫ్ రాకేష్ మోహన్ దోబ్రియాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సిరికొండ రేంజ్ కు ఎం.వినాయక్ కు రెండవ ఎఫ్ ఆర్ ఓ కావడం గమనార్హం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం యాచారం తాండకు చెందిన ఎం.వినాయక్ డైరెక్ట్ ఎఫ్ఆర్ వోగా రిక్రూట్ అయ్యారు. గతంలో నిజామాబాద్ రేంజ్ లో స్పెషల్ డ్యూటీలో పని చేశారు. రెండేళ్ళ క్రితం...