- పీడీఎస్యూ, ఏఐఎఫ్ఢీఎస్ విదార్థి సంఘాల నాయకులు అరెస్ట్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ, ఏఐఎఫ్డీఎస్ ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ గౌడ్ ఇంటిని ముట్టడించారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంటి ముందు శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పీడీఎస్యూ, ఏఐఎఫ్ఢీఎస్ విదార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి నాలుగో టౌన్ కు తరలించారు. విద్యార్థి సంఘాల నాయకులు ఆర్.గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని, మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ స్కూల్స్ డేంజర్ జోన్ లో ఉన్నాయని అన్నారు. గత నాలుగేళ్లుగా ఫీజు

రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్స్ బకాయిలు 8000 కోట్లు విడుదల చేయాలని,నూతన జాతీయ విద్య విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని, నర్సరీ నుండి ఇంజనీరింగ్ వరకు ఫీజులను నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని,ఖాళీగా ఉన్న డిఇఓ, ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ కార్తీక్, సహాయ కార్యదర్శి ప్రిన్స్ , ఏఐఎఫ్డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్, పీడీఎస్యూ జిల్లా నాయకులు మనోజ్, సాయినాథ్, రాహుల్, శ్రీకాంత్, పీడీఎస్యూ నగర నాయకులు సాయికిరణ్, దుర్గాప్రసాద్, ఏఐఎఫ్ఢీఎస్ నాయకులు మోసిన్, సాయి, మధు తదితరులు పాల్గొన్నారు.
