28.9 C
Hyderabad

సీజనల్ వ్యాధులపై అవగాహనకు షార్ట్ ఫిలిం ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే’ అనే షార్ట్ ఫిలింను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ ఆవిష్కరించారు. గోవిందపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మానస ఆధ్వర్యంలో రూపొందించిన ఈ షార్ట్ ఫిలింకు కోకిల నాగరాజు రచన, దర్శకత్వం వహించారు. షార్ట్ ఫిలిం ఆవిష్కరణ సందర్భంగా డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు తదితర సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించిన ఈ షార్ట్ ఫిలిం వ్యాధుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంచేందుకు ఇటువంటి వినూత్న కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా షార్ట్ ఫిలింలో నటించిన విద్యార్థినులు, ఆశా కార్యకర్తలు, వైద్యాధికారి డాక్టర్ మానస, ఉపాధ్యాయుడు, రచయిత, దర్శకుడు కోకిల నాగరాజులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Short film launched to raise awareness about seasonal diseases.

More articles

Latest article