సీజనల్ వ్యాధులపై అవగాహనకు షార్ట్ ఫిలిం ఆవిష్కరణ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే’ అనే షార్ట్ ఫిలింను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ ఆవిష్కరించారు. గోవిందపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మానస ఆధ్వర్యంలో రూపొందించిన ఈ షార్ట్ ఫిలింకు కోకిల నాగరాజు రచన, దర్శకత్వం వహించారు. షార్ట్ ఫిలిం ఆవిష్కరణ సందర్భంగా డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్...