పిట్లం, బతుకమ్మ :
పిట్లం మండల కేంద్రంలో కమిషన్ల కొరకు ఉన్నత నాయకులు వేధిస్తున్నారని కల్లు దుకాణంలు బంద్ చేయించారని గౌడ సంఘం నాయకులు ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు పిట్లం మండలంలో ఏ గ్రామంలో కూడా కల్లు దుకాన్లు మూసివేసిన దాఖలు లేవు. మండల కేంద్రంలోని ఎందుకు మూసివేసారని గౌడ సంఘం సభ్యులు ప్రశ్నిస్తున్నారు. మండలంలోని రాంపూర్, చిన్న కొడప్ గల్, తిమ్మా నగర్ కారేగాం ఇలాంటి గ్రామాలు ఎన్ని ఉన్నా అక్కడ మాత్రమే కల్లు మాత్రం హెచ్చన్నగా కొనసాగుతుంది. అధికారులు మాత్రం తనిఖీలు చేస్తూ వదిలేస్తున్నారు. మండల కేంద్రంలో కల్లు దుకాణాలు మూసివేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.కల్లు అల్లవాటు పడవలుప్రజలు పక్కన వున్న గ్రామాలకు, మండలం కు వెళ్లి త్రాగి వస్తే ప్రమాదాలు జరుగుతుంది. మండలం కేంద్రంలోచర్యలు తీసుకున్నట్టు అన్ని గ్రామాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కల్లు బంద్ చేయిస్తే బాగుంది అన్ని ప్రజలు అంటున్నారు. కొంతమంది అధికారులు నాయకులు డిపో నుండి కమిషన్లు రావడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కక్షగట్టి కల్లు దుకాణాలు మూయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా కల్లు ప్రియులకు న్యాయం చేయాలని గౌడ సంఘం కోరుతుంది.
