25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రవాణా శాఖ అధికారులు తనిఖీ లో దారుణం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . . బొగ్గు లారీ ఢీకొని డి టి ఓ దుర్మరణం

 వెబ్ డెస్క్ , బతుకమ్మ:

బొగ్గు లారీలు లోడ్ కు మించి రవాణా చేస్తున్న విషయం తెలిసి తనిఖీలు చెపట్టిన రవాణా శాఖ అధికారులపై బోగ్గులారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో రవాణా శాఖ భూపలపల్లి డిటిఓ వేంకన్న అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఓవర్ లోడ్ వాహనాలపై ప్రత్యేక టీం తో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. పరకాల- భూపాలపల్లి జిల్లా చెల్పూర్ మండలం గణపూరం శివారులో   సోమవారం ఉదయం భూపలపల్లి డిటిఓ వేంకన్న వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓవర్ లోడ్ తో వెలుతున్న బొగ్గు లారీ డిటిఓ తన సిబ్బందితో కలిసి అదెందుకు యత్నించారు. అసమయంలో టిప్పర్ డ్రైవర్ దానిని అపకుండా వేగంగా తీసుకువచ్చి డి టి ఓ వెంకన్నను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మిగితా సిబ్బందిపక్కకు జరిగి ప్రాణాలు కాపాడుకున్నారు.భూపలపల్లి జిల్లా డిటిఓగా వేంకన్న భాధ్యతలు తీసుకుని 20 రోజుల్లోనే  విది నిర్వహణలో బొగ్గు మాఫియా దాష్టికానికి బలయ్యారు అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వరంగల్- భూపలపల్లి జిల్లాలో బొగ్గు మాఫియా అగడాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

 

More articles

Latest article