29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కరెంట్ షాక్ తో భార్యాభర్తలు మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఊట్ పల్లి  గ్రామంలో ఘటన

 బోధన్, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊట్‌పల్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు బట్టలు ఆరబెట్టే ఇనుప వైర్‌కు కరేంట్ సరఫరా కావడంతో రత్నవత్ సంజీవ్ (38), రత్నవత్ జ్యోతి(32) దంపతులు విధ్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. రత్నావత్ సంజీవ్ కు ఇద్దరు భార్యలు.. నలుగురు సంతానం.. వ్యవసాయం చేసే సంజీవ్, జ్యోతి దంపతులు ఆదివారం రాత్రి పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చారు. వ్యవసాయ పనుల కారణంగా తడిసిన బట్టలు జ్యోతి  ఇనుపు వైర్ పై ఆరబెట్టేందుకు యత్నించగా విద్యుత్ శాఖ్ కు గురైంది. అమెను కాపాడేందుకు వెళ్లిన సంజీవ్ కూడా కరెంట్ షాక్ కు గురయ్యాడు. అక్కడికి వచ్చిన సంజీవ్ చిన్న భార్య వారిద్దరిని కాపాడేందుకు కర్రతో ప్రయత్నించగా ఆమె కూడా గాయపడింది. సంజీవ్, జ్యోతి దంపతులకు ముగ్గురు కూతుళ్లు కాగా వారిద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

More articles

Latest article