19.2 C
Hyderabad

ఇరవై వేల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఎస్ హెచ్ ఓ

SHO caught by ACB while taking a bribe of twenty thousand rupees

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ:

అర్ధరాత్రి వరకు హోటల్ నడుపాల అయితే తనకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసి వసూలు చేస్తున్న ఎస్ హెచ్ ఓ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  ప్రతి నెల రూ.50 వేలు ఇవ్వాలని ఓ హోటల్ యజమాని కి లంచం డిమాండ్ చేసిన టోలి చౌకి ఎస్ హెచ్ ఓ ఎల్.రమేష్ నాయక్. అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా హోటల్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చేందుకే లంచం డిమాండ్. మొదట్లో రూ.10 వేలు.. ఆపై అక్టోబర్ 31న హోటల్ యజమాని నుంచి రూ.20 వేలు తీసుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్. మరో రూ.20 వేలు ఇవ్వాలని అడగడంతో.. ఏసీబీ అధికారుల ను ఆశ్రయించిన హోటల్ యజమాని. బుదవారం రాత్రి ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్‌లోనే హోటల్ యజామాని నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా.. దాడులు చేసి రమేష్ నాయక్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు పోలిస్  స్టేషన్‌లో తనిఖీలు చేయగానాలుగు వేర్వేరు కవర్లలో లెక్కలు చూపని రూ.1.85 లక్షలు లభ్యం అయ్యాయి. ఆ మొత్తాన్ని సీజ్ చేసి.. రమేష్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.

SHO caught by ACB while taking a bribe of twenty thousand rupees

More articles

Latest article