26.2 C
Hyderabad

ఈ మిడిల్ క్లాస్ జీవితం వద్దు

I don't want this middle-class life.

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  అప్పుల భాధతో దంపతులు ఆత్మహత్య

 

. . . పెంపుడు కుక్కను చంపి భార్య భర్త ల బలవన్మరణం

 

. .  కంట తడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

వరంగల్‌ రంగశాయిపేటలో విషాదం నెలకొంది. నల్లపోగుల సంజయ్‌ కుమార్‌ (60), శోభ (53) దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహిళా టైలర్‌ వద్ద రూ.50 వేల అప్పు తీసుకున్న దంపతులు వారానికి రూ.750 చొప్పున వడ్డీ చెల్లించినట్లు సూసైడ్‌ నోట్‌లో వెల్లడించారు. వడ్డీ చెల్లింపులో ఆలస్యంపై అవమానించిందని లేఖలో దంపతులు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని ప్రస్తావించారు. ఆత్మహత్యకు ముందు పెంపుడు కుక్కనూ చంపేసిన దంపతులు, తమ అంత్యక్రియలను పెంపుడు కుక్క అంత్యక్రియలతో కలిపి నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు.

More articles

Latest article