29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గొర్రెల పంపిణీ కుంభకోణం కేసు : ఆరు చోట్ల ఈడీ సోదాలు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో హైదరాబాద్ లోని ఆరు చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్రనాయక్, ఈకేసులో ప్రధాన నిందితుడు మొయినుద్దీన్, పలువురు ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. ఈ కుంభకోణంపై మొదట ఏసీబీ కేసు నమోదు చేయగా, దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. కాగా, గొర్రెల పంపిణీ పథకంలో రూ. 700 కోట్లు అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో అధికారులు దళారులు కుమ్మక్కై నిధులు స్వాహ చేసినట్లు  ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. కాగా, ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీ, ఈడీ అనుమానిస్తోంది.

More articles

Latest article