23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థినులకు షీ టీం భరోసా

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం తరపున శుక్రకవారం షీ టీం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సిఐ రాజారెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కళాశాలలో షీ టీం సైబర్ క్రైమ్ అంశాలపై కళాబృందంతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. విద్యార్థినులు తమను ఎవరు వేధించినా, అసభ్యంగా ప్రవర్తించిన తమ షీ టీం బృందానికి తెలపాలి. ఫిర్యాదు చేసినవారి వివరాలు బయట పెట్టకుండానే సమస్యను పరిష్కరిస్తారు అన్నారు.  ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి పరిస్థితుల్లో జరుగుతున్న చెడును దృష్టిలో ఉంచుకొని మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలి అన్నారు. పోలీసు కళాబృందం బాధ్యులు రామంచ తిరుపతి తన మాట, పాటల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాల పట్ల అవగాహనా కలిగి ఉండాలి క్రమశిక్షణతో నడుచుకోవాలి. లక్ష్యం పట్ల చిత్తశుద్ధితో చదివి బాగుపడాలి. మూఢనమ్మకాలను వదిలిపెట్టాలి అన్నారు. షీ టీం ఎల్లారెడ్డి బాధ్యురాలు సుప్రజ మాట్లాడుతూ కళాశాలలో, బయటా ఎవరు వేధించినా తమకు తెలుపాలి అంటూ ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు ఎదురుకొంటున్న ప్రతి సమస్యను చాలా చక్కగా వివరించారు. భరోసా సెంటర్ కామారెడ్డి కౌన్సిలర్ కవిత ఫోక్సో చట్టం గురించి, జిల్లాలో ఫోక్సో చట్టం ప్రకారం పడిన శిక్షలను వివరించారు. సైబర్ క్రైమ్ ఎన్ని రకాలుగా వేధిస్తారో ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. చంద్రకాంత్ ఎల్లారెడ్డి సిఐ రాజా రెడ్డి, ఎస్ఐ మహేష్,  కామారెడ్డి పోలీసు కళా బృందం బాధ్యులు రామంచ తిరుపతి, ప్రభాకర్, భరోసా టీం సమన్వయకర్త కవిత, షీ టీం ఎల్లారెడ్డి విభాగం సుప్రజ, నిఖిత, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.  కళాశాల మహిళా సాధికారత సమన్వయకర్త డాక్టర్ ఎస్. గోదావరి, ఐ క్యూ ఏ సి, సాంస్కృతిక విభాగం సమన్వయకర్త డాక్టర్ వి. శంకరయ్య, టి ఎస్ కే సి సమన్వయకర్త జె.శివకుమార్, అధ్యాపకులు అమరేశం ప్రభాకర్ రావు, నాగనీక, రాణి, సంగీత, కీర్తి స్వప్న, కళాశాల సూపరింటెండెంట్ వసంత లక్ష్మి, డాక్టర్ బుద్దె అరుణ్ కుమార్, డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ సిద్దు రాజు, కృష్ణ ప్రసాద్, శశిధర్, చంద్ర కాంత్, సంతోష్, రాజు, సురేష్ రెడ్డి, కిరణ్, మోయిన్, దశరథ్, మహమూద్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article