విద్యార్థినులకు షీ టీం భరోసా

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం తరపున శుక్రకవారం షీ టీం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సిఐ రాజారెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కళాశాలలో షీ టీం సైబర్ క్రైమ్ అంశాలపై కళాబృందంతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. విద్యార్థినులు తమను ఎవరు వేధించినా, అసభ్యంగా ప్రవర్తించిన తమ షీ టీం బృందానికి తెలపాలి. ఫిర్యాదు చేసినవారి వివరాలు బయట పెట్టకుండానే సమస్యను పరిష్కరిస్తారు అన్నారు.  ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ...