నందిపేట్, బతుకమ్మ: మండలంలోని సిహెచ్ కొండూర్ లో చౌడమ్మ మందిరం వద్ద శత చండీయాగం భక్తుల కోలాహాలం మద్య మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే మహోత్సవానికి చుట్టు పక్కల గ్రామాల వారితోపాటు దూర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల ఆకలి తీర్చేందుకు గాను నిత్య అన్నదానం ఏర్పాటు చేసారు.
