25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం ద్వారకానగర్ లోని ఎస్ఎంఆర్ పితామహ క్యాన్సర్ ఆసుపత్రి లో  ప్రపంచ క్యాన్సర్ దినం ను పురస్కరించుకుని క్యాన్సర్ వ్యాధి పై అవగాహన సదస్సు  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డా.అజ్జ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి  డా.కే. విక్రం రెడ్డి మాట్లాడుతూ కాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తించి చికిత్స చేయించుకుంటె ఈ వ్యాధిని నివారించవచ్చునని అన్నారు. పోగాకు, గుట్క, ధూమపానం సేవించడం వల్ల ఊపిరి తిత్తుల వ్యాది వస్తుంది అని అన్నారు. ఈ వ్యాది నుండి రక్షించుకోవాడానికి, వాతావరణ కాలుష్యం నుండి రక్షించుకోని మంచి పోషకాహారాన్ని  తీసుకుని  పరిసరాలు శుభ్రంగా ఉండాలని అన్నారు. గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటె 20 సంవత్సరాలు పైబడిన మహిళలందరూ గర్భాశయ పరీక్షలు చేయించుకుని,  హెచ్ పీ వీ వ్యాక్సిన్  తీసుకుని  వైద్యుల సలహాలు తీసుకోవాలని తెలిపారు. క్యాన్సర్ వ్యాది వైద్య నిపుణులు డా. చైతన్య మాట్లాడుతూ నేటి ఆధునాతన ప్రపంచంలో రసాయనజనక ఆహార పదార్థలు, జంక్ పుడ్ , మద్యపానం, ధూమపానం అలవాట్లు అనేక రకాల క్యాన్సర్లకు దారి తీస్తునాయని, ప్రతి ఒక్కరు క్యాన్సర్ గురించి తెలుసుకొని  మత్తు పానియాలకు దూరంగా ఉండి మంచి పొష్కాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. జీవన శైలి విధానంలో మార్పు చేసుకొని  ప్రతి రోజూ వ్యాయామం చేయడంతో పాటు జీవన శైలిలో మానసిక ఒత్తిడి తగ్గించుకొవడం యోగ, ప్రాణయం చెయడం మంచిదని సూచించారు. అంతరం క్యాన్సర్ వ్యాధిని జయించిన వారిని క్యాన్సర్  వైద్య నిపుణులు డా. చైతన్య కుమార్ శాలువ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డా.అజ్జ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి  డా. K. విక్రం రెడ్డి, కొశాధికారి డా. రాజేందర్ సూరినీడు, డా. శ్రీశైలం,  డా. ఆకుల విశాల్ ,  డా. ఎల్. అర్చన, డా. వినోద్ కుమార్ గుప్తా, క్యాన్సర్  వైద్య నిపుణులు డా. చైతన్య కుమార్,  డా. శ్రీకాంత్  పాల్గొన్నారు.

Cancer Awareness Conference

More articles

Latest article