నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గు చేటు 

0 1,577
  • కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తూ రాష్ట్రం పాట పాడుతున్న మానాల 
  •  బీజేపీ భీంగల్ మున్సిపల్  ఇన్ఛార్జీ ఆరే రవీందర్

భీమ్ గల్, బతుకమ్మ : కేంద్రం కేటాయించిన నిధులతోనే రాష్ట్రం ముందుకు సాగుతుంటే కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం పై నిరాధార ఆరోపణలు చేయడం, విమర్శించడం సిగ్గు చేటు అని భీమ్ గల్ మున్సిపల్ బీజేపీ ఇంచార్జ్ అరే రవీందర్ అన్నారు. సోమవారం  భీమ్ గల్ పార్టీ కార్యాలయంలో నిర్వహించి ప్రెస్ మీట్ లోఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి  భారతీయ జనతా పార్టీపై చేసిన నిరాధార ఆరోపణల ను ఆయన తీవ్రంగా ఖందించారు.భీమ్ గల్ మున్సిపల్ గా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.25 కోట్ల కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వివిధ రూపాలుగా ఇచ్చిందని గుర్తు చేశారు.తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పడిన సంవత్సర కాలంలో భీంగల్ మున్సిపల్ కు ఒక నయాపైసా కూడా ప్రభుత్వం ఇవ్వకపోగ,తట్టెడు మట్టి తీయని కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీని విమర్శించడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినా సంవత్సర కాలంలో 6 గ్యారంటీలను అమలు చేయక పోగా,కల్లిబొల్లి మాటలు చెబుతూ కాలాక్షేపం చేస్తూ అభివృద్ధిలో ప్రపంచంలోనే దేశాన్ని ముందుకు తీసుకెళుతున్న భారతీయ జనతా పార్టీని నిందించడం తగదన్నారు.భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీపై ఆరోపణలు చేస్తే భీంగల్ పట్టణ శాఖ ద్వారా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని,దాంట్లో భాగంగానే సినీ హీరో అల్లు అర్జున్ ఎపిసోడ్ ని ముందుకు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందని ఆరోపించారు.చట్టం తన పని తాను చేసుకోపోతుందని,చెబుతూనే మరి చట్టం తన పని తాను చేసుకోపోయే విధానంలో సీ. ఎం ఎందుకు తల దూర్చడమని అన్నారు.గురుకుల పాఠశాలలో 50 మంది పిల్లలు అస్వస్థత గురైతే స్పందించని మీ నోర్లు  ఒక సినీ హీరో విషయంలో ఇంత హైడ్రామ సృష్టిస్తూ ఆ డ్రామాలో పాత్రలు మీరే పోషిస్తూ భారతీయ జనతా పార్టీ పైన నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు.అనంతరం బీజేపీ భీమ్ గల్ పట్టణ శాఖ అధ్యక్షులు యోగేశ్వర నర్సయ్య మాట్లాడుతూ భీమ్ గల్ మున్సిపల్ లో రూపాయి పని చేయని కాంగ్రెసు నాయకులు అభివృద్ది చేస్తున్న బీజేపీ పై నిందలు వేయడం తగదని, చేతనైతే అభివృద్దికి నిధులు తెచ్చి మాట్లాడాలని హితవు పలికారు.లేని యెడల భీమ్ గల్ మున్సిపల్ లో అడుగు వేసే అధికారం లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  సీనియర్ నాయకులు సంధ్య రాజు, బూత్ అద్యక్షులు గోపు అంజి, ఉప్పల నవీన్, బండారు నరేందర్, తోపారం నరేందర్,తోపారం సురేందర్, సెవ్వ గంగాధర్, సేవ్వ లింబాద్రి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.