24.1 C
Hyderabad
Monday, August 3, 2026

  పహల్గామ్‌ ఉగ్రదాడిని ఖండించిన షబ్బీర్ అలీ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : జమ్మూ కాశ్మీర్‌ లోని  పహల్గామ్‌ ఉగ్రదాడిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ లోనీ ఆయన నివాసంలో శుక్రవారం ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ముక్తకంఠంతో అందరూ ఈ దాడిని ఖండిస్తూ,  అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని  ప్రార్థించాలన్నారు.  ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఉగ్ర దాడులకు  పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా శిక్ష అమలు చేయాలన్నారు. ఉగ్రవాదానికి మతం ఉండదని, చిన్న చీమకు కూడా హాని  తలపెట్ట వద్దని ఇస్లాం చెప్తుందన్నారు. ఉగ్రవాదంపై ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకు అయినా సరే మా మద్దతు ఉంటుందన్నారు.

More articles

Latest article