24.7 C
Hyderabad
Monday, August 3, 2026

’గ్రామ పంచాయతీ పాలన‘ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ పాలన పుస్తకాన్ని మంత్రి సీతక్క హైదరాబాద్ లో ఆవిష్కరించారు. దేశంలో పంచాయతీరాజ్ చరిత్ర మొదలుకొని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, గ్రామ సభలు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికలు, అర్హతలు, సర్పంచ్, సెక్రెటరీ నిధులు విధులు, గ్రామ పంచాయతీలో పన్నులు నిధుల వినియోగం, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్, గ్రామ ప్రగతి ప్రణాళిక లు.. ఇలా సమగ్ర విషయాలను క్రోడీకరించి పుస్తకాన్ని రచయిత కె.వి.రావు రూపొందించారు. గ్రామ పంచాయతీ పాలనపై అవగాహన పెంచుకునేందుకు ఈ పుస్తకం ఎంతగానో దోహదపడుతుందని మంత్రి సీతక్క అన్నారు.

More articles

Latest article