పహల్గామ్‌ ఉగ్రదాడిని ఖండించిన షబ్బీర్ అలీ

హైదరాబాద్, బతుకమ్మ : జమ్మూ కాశ్మీర్‌ లోని  పహల్గామ్‌ ఉగ్రదాడిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ లోనీ ఆయన నివాసంలో శుక్రవారం ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ముక్తకంఠంతో అందరూ ఈ దాడిని ఖండిస్తూ,  అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని  ప్రార్థించాలన్నారు.  ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఉగ్ర దాడులకు  పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా శిక్ష అమలు చేయాలన్నారు. ఉగ్రవాదానికి...