24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మురుగు నీరు ఉంటే ముప్పే

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: గ్రామాల్లో మురుగునీరు నిలిస్తే వాటిపై దోమలు అభివృద్ధి చెంది ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తాయని చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సుప్రియ అన్నారు. మోర్తాడ్ మండలంలోని వడ్యట్ గ్రామంలో శనివారం ఆమె పర్యటించారు. గ్రామాల్లో మురుగునీరు నిలిచిన చెత్తాచెదారం పేరుకుపోయిన, ఇంటి చుట్టుపట్ల అపరిశుభ్రంగా ఉన్న దోమలు వృద్ది పొందుతాయని ఫలితంగా డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ జ్వరాలు రావడానికి కారణం అవుతాయని పేర్కొన్నారు. ప్రతి వీధిని శుభ్రపరచాలని బ్లీచింగ్ పౌడర్ చల్లాలని అక్కడి గ్రామపంచాయితీ సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. కార్యక్రమంలో ఏఎన్ఎం విజయలక్ష్మి, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు తదితరులు పాల్గొన్నారు.

Sewage water is dangerous

More articles

Latest article