- ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో వరి కోతలు గత పది పదిహేను రోజుల నుండి రైతులు ప్రారంభించిన ఇంతవరకు వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం మీనా వేషాలు లెక్కపెడుతుంది వెంటనే ప్రభుత్వం జిల్లాలో తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య కోరారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరి కోత సీజన్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేయడం వల్ల మార్కెట్లో దళారులు వ్యాపారస్తులు ధాన్యానికి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని అన్నారు. దీంతో రైతులను లక్షల రూపాయలు నష్టపోతుందని అన్నారు. ఎంఎస్పీ మద్దతు ధరలు రైతులకు అందక తీవ్ర నష్టాలను గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సంస్థలో పీఏసీసీఎస్, ఐకేపీ, ఎఫ్ సీఐ , డ్వాక్రా సంఘాలు తద్వారా అమ్మక పొతే రైతులకు బోనస్ కూడ వచ్చే అవకాశం కూడా రాకుండా పోతుందని, దీనివల్ల రైతులు నష్ట పోతారు అని అన్నారు. దీనితో పాటు సంచికి 2 నుంచి 5 కిలోల తరుగు పేరుమీద కట్ చేస్తున్నారని, దీనివల్ల రైతులు దళారుల, వ్యాపారాస్తుల చేతులలో నిలువు దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తగినన్ని కొనుగోలుకేంద్రాలు జిల్లా అంతటా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు నాయక్ వాడి నర్సయ్య, ఉపాధ్యక్షులు బి.సాయిలు , కే. గోపాల్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
