29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రాజంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

  • ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే అదుపుతప్పిన బస్సు
  • అక్కడికక్కడే ఇద్దరు మృతి
  • రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు ఎక్కడికక్కడే నిలిచిన వాహనాలు

 

రాజంపేట, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండల లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుండారం నుండి కామారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సు టీవీఎస్ ఎక్సెల్ ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్ర సమీపంలో బైక్ అర్టీసీ బస్ ఢీకొని బైక్ మీద ఉన్న నడిపి సిద్ధిరాములు(50) మనుమడు శేయంక్ (04) మృతి చెందారు. శ్రేయంష్ కు కుక్క కరిసిందని బస్వన్నపల్లి నుంచి రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కి చికిత్స గురించి వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వేగంగా ఆర్టిసి బస్సు బైక్ పై కి దూసుకెళ్లడంతో ఆర్టిసి బస్సు ముందు భాగంలో ఇద్దరు ఇరుక్కున్నారు.

Serious road accident in Rajampet mandal

ఈ విషయం తెలుసుకున్న బస్వన్నపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై ఆందోళన చేస్తున్నారు. దీంతో కామారెడ్డి నుంచి మెదక్ కు గుండారం వెళ్లే రోడ్డు ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ప్రస్తుతానికి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సు కిందనే మృతులు టీవీఎస్ ఎక్సెల్ అక్కడే ఉన్నాయి. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతూనే ఉంది. కామారెడ్డి డిపో సిఐ లింగమూర్తి ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

Serious road accident in Rajampet mandal

More articles

Latest article