27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రాజన్న కోడెలు మరణిస్తున్నా పట్టించుకోవడం లేదు

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 

ఇందల్వాయి, బతుకమ్మ : వేములవాడలో రోజుకొక రాజన్న కోడె మరణిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందల్వాయి రామాలయాన్ని సోమవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆలయాల ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజన్న కోడెల మరణాలను ఆపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందల్వాయి రామాలయం అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని గ్రామాల్లో చిన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం కేసీఆర్ రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారని విమర్శించారు. మహిళలకు 2500 ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామన్నారు. కల్యాణలక్ష్మిలో భాగంగా వెంటనే తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Rajanna Kodelu doesn't care even if he dies.

More articles

Latest article