24 C
Hyderabad
Sunday, August 2, 2026

మినీ జూనియర్ బేస్ బాల్ జిల్లా జట్ల ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ  :

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సుద్దపల్లి క్రీడా మైదానంలో మినీ జూనియర్ అండర్-11 బాల బాలికల జిల్లా జట్ల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల వైస్ ప్రిన్సిపల్ స్వప్న విచ్చేసి క్రీడా ఎంపికను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలలో రాణించి జాతీయ పోటీలకు ఎక్కువ మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించాలన్నారు. అనంతరం జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ లు మాట్లాడుతూ ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులను గజ్వేల్ లో జరిగే పోటీలో పాల్గొంటారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగా మోహన్, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వనిత, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జోష్ణ, జిల్లా కోచ్ లు  వి.మౌనిక, సంతోష్, శ్రీలత లు పాల్గొన్నారు.

More articles

Latest article