మినీ జూనియర్ బేస్ బాల్ జిల్లా జట్ల ఎంపిక

ఆర్మూర్, బతుకమ్మ  : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సుద్దపల్లి క్రీడా మైదానంలో మినీ జూనియర్ అండర్-11 బాల బాలికల జిల్లా జట్ల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల వైస్ ప్రిన్సిపల్ స్వప్న విచ్చేసి క్రీడా ఎంపికను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలలో రాణించి జాతీయ పోటీలకు ఎక్కువ మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించాలన్నారు. అనంతరం జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ లు మాట్లాడుతూ ఈ...