👉 నగరశివారులో ఘటన
👉 ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అదుపులో ఇద్దరు
నిజామాబాద్ క్రైo, బతుకమ్మ: నిజామాబాద్ నగర శివారులోని కాలూర్ కల్లుబట్టిలో నిషేధిత అల్ప్రా జోలం మత్తు పదార్థాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విశ్వసనీయ సమాచారంతో పట్టుకున్నారు. మాక్లూ రు మండలం లోని ఒక గ్రామానికి చెందిన కల్లు మూస్తే దారుకు కాలూరులో కల్లు డిపో( కృత్రిమ మత్తు పదార్థాలతో తయారు చేసే ) ఉంది. ఈత తాటి చెట్ల నుంచి కల్లు సేకరణ లేకుండానే మత్తు పదార్థాలను వినియోగించి కల్లు తయారు చేసేందుకు రా మెటీరియల్ తెప్పించారన్న విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం దాడి చేసింది. డిపో నిర్వాహకుడు తో పాటు సరఫరాదారున్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కిలోల డ్రగ్ అల్ఫ్రా జోలం పట్టుకున్నట్టు తెలిసింది. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ. 20 లక్షల వరకు ఉంటుందని అంచనా. సంబంధిత నిషేధిత డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చిందని కోణంలో విచారిస్తున్నట్టు సమాచారం.. అయితే కల్లు డిపో నిర్వాకుడు ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారో లేదో అప్పుడే నేతలు పైరవీలు మొదలుపెట్టినట్టు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే తమ్ముడు ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి రా మెటీరియల్ దొరికిందా లేకపోతే వదిలేయాలని కోరినట్టు సమాచారం….
రాష్ట్రంలో కల్తీకల్లు పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. హైదరాబాదులో కృత్రిమ రసాయనాల తో తయారుచేసిన మత్తుకల్లు సేవించి ఆరుగురు మృత్యువాత పడగా 50 మంది పైగా ఆసుపత్రి పాలయ్యారు. అయినప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీకల్లు తయారీ కుటీర పరిశ్రమను దాటిపోయి చిన్న తరహా పరిశ్రమగా కొనసాగుతోంది. కృత్రిమ మత్తు కల్లు తయారీకి వాడే అల్ఫ్రా జోలం వాడకం ఉమ్మడి ఇందూరు జిల్లాలోని అధికం. రాష్ట్రంలో డేంజర్ డ్రగ్ గా పేరుందిన అల్ఫ్రా జోలం ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, పట్టణం మొదలుకొని నగరంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు కల్లు మూస్తేదారులు. వారికి ఎక్సైజ్ పోలీస్ పొలిటికల్ లీడర్ల అండదండలతో కృత్రిమ కల్లు తయారీ లక్షల లీటర్ల కొనసాగుతూ మత్తు కల్లుకు ప్రజలు బానిసలు అవుతున్నారు.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మత్తుకల్లు పై కఠినంగా వ్యవహరిస్తుందో తూ తు మంత్రంగా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.
