బతుకమ్మ,మోర్తాడ్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు మోర్తాడ్ లో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ మాట్లాడుతూ వానాకాలం ప్రారంభంలోనే రైతులకు వ్యవసాయ, అనుబంధ రంగాల వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలోని రైతులకు వ్యవసాయంలో వస్తున్నటువంటి నూతన సాంకేతిక అంశాలను,అధిక దిగుబడులను ఇచ్చేటువంటి నూతన వంగడాలు, రకాల పై అవగాహన కల్పిస్తామన్నారు. శిక్షణతో పాటుగా ముఖ్యంగా యూరియా వాడకం తగ్గించడం, మోతాదుకు మించి రసాయన ఎరువుల వాడకంతో కలిగే నష్టాను, విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి, భూగర్భ జలాల పరిరక్షణ కోసం సాగు నీటి వినియోగం పై అవగాహన, పంటల మార్పిడి, చెట్ల పెంపకం పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల గూర్చి విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించమన్నారు. ఈ కార్యక్రమంలో వరి పరిశోధన శాస్త్రవేత్త మంజు భార్గవి, దుర్గ రాణి, పశు వైద్య అధికారి గౌతమ్, ఏఈవో రంజిత్, గ్రామ రైతులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.
