రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు -అన్నదాతలకు అవగాహన
బతుకమ్మ,మోర్తాడ్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు మోర్తాడ్ లో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ మాట్లాడుతూ వానాకాలం ప్రారంభంలోనే రైతులకు వ్యవసాయ, అనుబంధ రంగాల వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలోని రైతులకు వ్యవసాయంలో వస్తున్నటువంటి నూతన సాంకేతిక అంశాలను,అధిక దిగుబడులను ఇచ్చేటువంటి నూతన వంగడాలు, రకాల పై అవగాహన కల్పిస్తామన్నారు. శిక్షణతో పాటుగా ముఖ్యంగా యూరియా వాడకం తగ్గించడం, మోతాదుకు...