అయిలాపూర్ గ్రామంలో బడిబాట
లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న తల్లిదండ్రులు వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు దామోదర్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని చిన్నారుల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. బడి అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి, విద్యా విషయాలకు సంబంధించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు...