కోటగల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బడిబాట కార్యక్రమంలో భాగంగా 4వ రోజు సోమవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కోటగల్లి (శంకర్ భవన్) పాఠశాల పరిధిలోని కోటగల్లీలో బడి ఈడు, డ్రాప్ అవుట్, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్ ఆధ్వర్యలో ఉపాధ్యాయులు ఇంటింటిని సందర్శించారు. అనంతరం అంగన్వాడి సెంటర్ ను సందర్శించి అంగన్వాడి టీచర్ సహకారంతో ముగ్గురు పిల్లలను గుర్తించి, తర్వాత ఇందిరా చౌక్, భగత్ సింగ్ చౌక్ లో ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపాలని ఫ్లెక్సీ ప్రదర్శించి కరపత్రాలను...