జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలో బుధవారం స్కూల్ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పదో తరగతి చదువుతున్న ప్రణవ్ (15) అనే విద్యార్థి మృతిచెందాడు. మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థి గ్రామం సావర్గావ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈప్రమాదంపై జుక్కల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
