నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని వినాయక్ నగర్ లో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఒక మహిళ ఇంటి ముందు ఒంటరిగా పనులు చేసుకుంటుంది. సదరు మహిళను అడ్రస్ అడిగి మాటల్లో పెట్టిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో నుంచి బంగారు గొలుసును దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడీయో సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు మాస్క్ ధరించి ఉన్నారు. నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
